విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు: సామాన్యులకే పెద్దపీట వేయాలని చంద్రబాబు స్పష్టం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయవాడ

విజయవాడ దుర్గగుడిలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని, సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వీఐపీల రాక కారణంగా సామానులు ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. ఈ దసరా వేడుకలు కేవలం వీఐపీల కోసం కాకుండా పూర్తిగా సామాన్యుల పండుగలా జరగాలని ఆయన తేల్చిచెప్పారు.