నాటో దేశాలపై రష్యా ప్రమాదకర దాడుల ముప్పు

రిపోర్టర్: సతీష్ స్థలం: Europe

నాటో భూభాగంపై రష్యా ప్రమాదకరమైన దాడులకు పాల్పడే అవకాశం ఉందని, వాటిని ప్రమాదాలుగా చిత్రీకరించేందుకు కుట్ర పన్నుతోందని యూరప్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క హెచ్చరికల నేపథ్యంలో బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ సరిహద్దులు దాటి నాటో కూటమిని పరీక్షించే అవకాశం ఉందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.