తాడ్వాయిలో నీటి వృథా: అధికారుల తీరుపై గ్రామస్థుల తీవ్ర అసహనం

రిపోర్టర్: సతీష్ స్థలం: తాడ్వాయి

తాడ్వాయి మండలంలోని కరడ్ పల్లి గ్రామంలో నల్లా పైపు నుంచి తాగునీరు నిరంతరం వృథాగా పోతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలినో ప్రభావంతో రాబోయే రోజుల్ లో నీటి ఎద్దడి రాకుండా పొదుపు పాటించాలని అధికారులు సమీక్షలు నిర్వహిస్తుంటే, కళ్లెదుటే నీరు వృథా అవుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. అధికారుల మాటలు కేవలం సమీక్షలకే పరిమితమయ్యాయని విమర్శిస్తూ, తక్షణమే వృథా నీటిని అరికట్టి సంరక్షించాలని స్థానికులు కోరారు.