విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ సీట్ల కేటాయింపు ముందే నామినేషన్ల కలకలం

రిపోర్టర్: సతీష్ స్థలం: Vijayawada

బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు కొలిక్కి రాకముందే కూటమి అభ్యర్థులు జోరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. అధికారికంగా అభ్యర్థిత్వం ఖరారు కాకపోయినా ఒక్కరోజే ఏకంగా పందొమ్మిది నామినేషన్లు దాఖలవడం కూటమి పార్టీల్లో తీవ్ర టెన్షన్ పుట్టిస్తోంది. పొత్తు ధర్మం పాటించడంలో సవాళ్లు ఎదురవుతాయని, రెబల్స్ బెడద తప్పదని ప్రధాన పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు.