నెల్లూరు జిల్లాలో రోటా వైరస్ వ్యాక్సిన్ల తీవ్ర కొరత
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో చిన్నారులకు ప్రాణాధారమైన రోటా వైరస్ వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకాలు అందక నిరుపేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వైద్యులు ఒక్కో డోసుకు వేయి రూపాయల వరకు వసూలు చేస్తూ పేదలను దోచుకుంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వ్యాక్సిన్ల కొరతను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.