అమరావతి ఉద్యమ నేత ధనేకుల రామారావు కన్నుమూత

రిపోర్టర్: రమేష్ స్థలం: గుంటూరు

అమరావతి రాజధాని ఉద్యమ నేత, ఐకాస సమన్వయ కమిటీ సభ్యుడు ధనేకుల రామారావు అనారోగ్యంతో మృతి చెందారు. రాజధాని కోసం ఆయన ముందుకొచ్చి 50 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. మూడు రాజధానుల బిల్లుపై హైకోర్టులో పోరాడి విజయం సాధించారు. ఉద్యమ వేళ 40 రోజులు జైలు జీవితం గడిపారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.