ప్రపంచ పాలనలో సంస్కరణలు రావాల్సిందే: ప్రధాని మోదీ
రిపోర్టర్: మహేష్
స్థలం: New Delhi
ప్రపంచ సంక్షోభాల్లో గ్లోబల్ సౌత్ దేశాలు ముందుంటున్నా, నిర్ణయాల ప్రక్రియలో వెనుకబడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిక్స్ సదస్సులో ఆయన మాట్లాడుతూ, అధికార పిరమిడ్‌ను భాగస్వామ్య వేదికగా మార్చాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాలానికి తగినట్లుగా సంస్కరణలు వెంటనే చేపట్టాలని మోదీ గట్టిగా డిమాండ్ చేశారు.