చిన్నారులపై డిజిటల్ స్క్రీన్ల పంజా: పెరుగుతున్న కంటి మరియు మానసిక సమస్యలు

రిపోర్టర్: సునీల్ స్థలం: నెల్లూరు

నేటి తరం చిన్నారుల్లో డిజిటల్ స్క్రీన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో కంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి టీవీలు, ఫోన్లు, ట్యాబ్లను చూడటం వల్ల పిల్లల్లో మయోఫియా వంటి రుగ్మతలు తలెత్తుతున్నాయని నెల్లూరు జిల్లా వైద్య వర్గాలు స్పష్టం చేశాయి. ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో వేలాది మంది విద్యార్థులకు కంటి సమస్యలు ఉన్నట్లు వెల్లడైంది. స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల మానసిక ఒత్తిడితో పాటు చదువుపై ఏకాగ్రత కొరవడుతోందని హెచ్చరిస్తున్నారు.