'ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం': నెల్లూరులో మంత్రి నారా లోకేశ్
రిపోర్టర్: సురేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో సీఎస్ఆర్ నిధులతో ఆధునికీకరించిన ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం ప్రారంభించారు. మంత్రి పి. నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పాఠశాల భవనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఆయన, తరగతి గదులు, ల్యాబ్స్, డైనింగ్ హాల్‌ను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. కార్పొరేట్ హంగులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఈ సందర్భంగా లోకేశ్ ఆకాంక్షించారు.