ఫామ్-7 దరఖాస్తులపై కలకలం: ఐదు లక్షలకు పైగా ఓట్లకు ఆమోదం
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలో ఫామ్-7 దరఖాస్తుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోందని సీఈవో కార్యాలయ అధికారులు తెలిపారు. జనవరి నుంచి అక్టోబర్ వరకు ఏకంగా అయిదు లక్షల ఎనభై నాలుగు వేలకు పైగా దరఖాస్తులు అందగా, అందులో ఐదు లక్షల పది వేలకు పైగా ఓట్ల తొలగింపునకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఒక నిర్దిష్ట వర్గం ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దరఖాస్తులు సమర్పించారనే ఆరోపణలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.