'ట్యాంక్ బండ్పై విగ్రహాల నిమజ్జనం లేదు': హైకోర్టు ఆదేశాలతో నిషేధం
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ హైకోర్టు ఆదేశాలు మరియు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో వినాయక నిమజ్జనాలను పోలీసులు పూర్తిగా నిషేధించారు. నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక సీసీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు. భక్తుల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా ఘాట్లు మరియు ప్రత్యేక బేబీ పాండ్లను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసింది. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం కూడా ఎన్టీఆర్ మార్గ్ ఘాట్ వద్దే నిర్వహించనున్నారు.