టాలీవుడ్లో తీవ్ర విషాదం: కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్
రిపోర్టర్: రాజేష్
స్థలం: చెన్నై
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుందని, ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ వృద్ధాప్య సమస్యలతో చెన్నైలో తుదిశ్వాస విడిచారని సినీ వర్గాలు వెల్లడించాయి. తొలుత రంగస్థల కళాకారిణిగా ప్రయాణం ప్రారంభించిన ఆమె, అరవై ఏళ్ల వయసులో మణిరత్నం చిత్రం రోజా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించి, అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ బామ్మగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆమె మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు.