ఎన్నికల సంఘంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: లక్నో
ఉత్తరప్రదేశ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పిడిఎ వర్గాల ఓట్లను చోరీ చేశారంటూ ఎన్నికల సంఘంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాయ్‌బరేలీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఆ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరగకపోతే ఎస్పీ అధికారంలోకి వచ్చేదని ధ్వజమెత్తారు. వ్యవస్థల పనితీరుపై ఆయన వ్యక్తం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.