అడ్డదార్లతో ప్రధాని పీఠం ఎక్కాలని చూస్తే ప్రజాస్వామ్యం క్షమించదంటూ కాంగ్రెస్పై ఎంపీ రమేష్ ధ్వజం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అనకాపల్లి

మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలనే కాంగ్రెస్ వైఖరి ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని డాక్టర్ సి.ఎం. రమేష్ - ఎంపీ అనకాపల్లి మండిపడ్డారు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోలేక అడ్డదార్లలో ప్రధాని పీఠం ఎక్కాలని చూస్తే ప్రజాస్వామ్యం క్షమించదని ఆయన హెచ్చరించారు. ముందుగా ప్రజల ఆశీస్సులు, నమ్మకాన్ని సంపాదించుకోవాలని, ఆ తర్వాతే అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలని సూచిస్తూ కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.