పక్షవాతం బాధితులను వేధిస్తున్న తీవ్ర అలసట: వైద్య నిపుణుల కీలక వెల్లడి
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలంగాణ
పక్షవాతం నుంచి కోలుకున్న తర్వాత చాలా మంది తీవ్రమైన అలసటతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్ గుప్తా వెల్లడించారు. సాధారణ పనులకు కూడా మెదడు ఎక్కువ శ్రమించాల్సి రావడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు. సుమారు యాభై శాతం మంది బాధితులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని వైద్యులు హెచ్చరించారు.