పొదలకూరును సస్యశ్యామలం చేసిన ఘనత టీడీపీదేనంటూ ఓట్లు కోరిన సోమిరెడ్డి

రిపోర్టర్: sujith reddy స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి, నల్లబాళెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. మండలానికి తాము చేసిన అభివృద్ధిని వివరించారు. కండలేరు ఎడమ కాలువ లిఫ్ట్, దక్షిణ కాలువ ద్వారా మెట్ట ప్రాంతాన్ని మాగాణిగా మార్చామని చెప్పారు. ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేసి టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.