ఢిల్లీలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్కు గోల్డ్ స్కోచ్ అవార్డు

రిపోర్టర్: రమేష్ స్థలం: ఏలూరు

ఢిల్లీలో జరిగిన నూట తొమ్మిదవ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్కు గోల్డ్ స్కోచ్ అవార్డు దక్కడం ఎంతో గర్వకారణమని గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి అలాగే నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వెల్లడించారు. అమరావతి క్వాంటం వ్యాలీ అంశంలో డిజిటల్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ విభాగంలో ఈ పురస్కారం లభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని, డిజిటల్ రంగంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి ఇది చక్కటి తార్కాణమని ఆయన వివరించారు.