విద్యార్థులకు అలర్ట్: సీబీఎస్ఈ స్పెషల్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూఢిల్లీ

ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా పరీక్షలు రాయలేకపోయిన పశ్చిమాసియా అభ్యర్థుల కోసం ప్రత్యేక పరీక్షల షెడ్యూల్ను సీబీఎస్ఈ విడుదల చేసిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక పరీక్షలు అక్టోబర్ 23వ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ 28వ తేదీ వరకు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. సంబంధిత దేశాల్లోని ప్రత్యేక కేంద్రాల్లో ఉదయం పదిన్నర గంటల నుంచి పరీక్షలు జరుగుతాయని బోర్డు పేర్కొంది.