'శిశువులను వదిలేయకండి.. పోలీసులను సంప్రదించండి': ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Eluru
ఏలూరు జిల్లాలో నవజాత శిశువుకు పోలీసులు భరోసానిచ్చారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆసుపత్రిని సందర్శించి శిశువును పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలివేయవద్దని, అత్యవసర సమయాల్లో 1098, 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.