బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిజాంను ఆదర్శంగా తీసుకుని భూ దోపిడీ చేశాయి
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాంను ఆదర్శంగా తీసుకుని భారీ భూ కుంభకోణాలకు పాల్పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా ఆరోపించారు. శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ రెండు పార్టీల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అధికారంలోకి రాగానే దోషులను చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.