విజయవాడలో డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ ఇంజినీర్కు పది కోట్ల టోకరా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయవాడ

విజయవాడలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ కేటుగాళ్లు సృష్టించిన భయానక వాతావరణంలో విశ్రాంత ఇంజినీర్ ఏకంగా పది కోట్ల రూపాయలు పోగొట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తాము పోలీసు అధికారులమని నమ్మించి నకిలీ వీడియో కాల్స్ ద్వారా తీవ్రంగా బెదిరించి, మనీలాండరింగ్ కేసు నుంచి తప్పిస్తామని చెప్పి నాలుగు వేర్వేరు ఆన్లైన్ లావాదేవీల ద్వారా తమ ఖాతాలకు నగదు బదిలీ చేయించుకున్నారని అధికారులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు.