హారర్ సినిమా చూస్తూ తీవ్ర భయాందోళన: ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉల్హాస్ కామ్తే ఆసుపత్రిపాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ముంబై

ముంబైలో హారర్ సినిమా ప్రీమియర్ చూస్తుండగా ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉల్హాస్ కామ్తేకి తీవ్ర భయాందోళన కలిగి అకస్మాత్తుగా కుప్పకూలినట్లు ఆయన తెలిపారు. భయానక సన్నివేశం చూసి ఆయన తీవ్ర ఆందోళనకు గురై స్పృహ కోల్పోవడంతో చిత్ర యూనిట్ వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినట్లు దర్శకుడు రాజన్ రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. అయితే ఆయన గుండెపోటుతో మృతి చెందారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు అవాస్తవమని, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.