మురుసు తుఫాన్ బీభత్సం: తల్లాడలో జలమయమైన పంటలు రాకపోకలు బంద్

రిపోర్టర్: గోపి స్థలం: తల్లాడ

మురుసు తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. మాచవరం వాగు ఉద్ధృతికి పలు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయని, వందలాది ఎకరాల్ లో వరి పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారని, ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.