వినాయక మండపాలలో పోలీసు అధికారుల ఆకస్మిక తనిఖీలు

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాలతో నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష నగరంలోని వివిధ వినాయక మండపాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు మరియు భక్తులతో మమేకమై భద్రతా ఏర్పాట్లపై తగిన సూచనలు చేశారు. భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని, ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. తనిఖీల్లో నగర పరిధిలోని వివిధ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.