ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్లో ఎస్ఐ దుర్మరణం
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ కె.వెంకన్న మృతి చెందారు. గణేష్ నిమజ్జన విధుల్లో భాగంగా క్రేన్ 2 వద్ద డ్యూటీలో ఉన్న ఆయనను గుర్తుతెలియని బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టి పరారైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.