విజయనగరం జిల్లాలో భారీ వర్షాలకు నీటమునిగిన ఉద్యాన పంటలు

రిపోర్టర్: హరి స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలోని పలు మండలాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సుమారు 189.83 హెక్టార్లలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బైరెడ్డిపేటలో అరటి పంటను తహసీల్దారు సంతోష్‌కుమార్‌ పరిశీలించారు. అరటి, బొప్పాయి పంటలు నీట మునగడంతో సుమారు ఐదు కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పంట నష్టాన్ని పరిశీలిస్తున్నారని జిల్లా ఉద్యానశాఖ డీడీ చిట్టిబాబు తెలిపారు.