ఎమ్మిగనూరు మండలంలో వరుస విద్యుత్ కోతలు.. రాత్రివేళ చీకట్లో ప్రజల అవస్థలు!
రిపోర్టర్: AMPAIAH ACHARI
స్థలం: ఎమ్మిగనూరు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని గ్రామాల్లో వరుసగా మూడో రోజు విద్యుత్ కోతలు కలకలం రేపుతున్నాయి. ప్రతిరోజూ రాత్రి 9 గంటల నుంచి 10, 11 గంటల వరకు కరెంటు అంతరాయం ఎందుకు? అసలు కారణమేంటి? అన్న ప్రశ్నలు గ్రామస్థుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రాత్రివేళ కరెంటు లేక చీకటిలో భోజనం చేయలేక ప్రజలు అవస్థలు పడుతుండగా, దోమల బెడదతో చిన్నారులు ఏడుపులతో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు దోమకాటుతో జ్వరాలు వస్తాయేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరి అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా? విద్యుత్ అంతరాయానికి అసలు కారణాన్ని బయటపెట్టి సమస్యను పరిష్కరిస్తారా? లేక ప్రజల ఇబ్బందులు ఇలాగే కొనసాగుతాయా? అధికారుల స్పందన కోసం గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు.