తాజ్ హోటల్ ఘటన: వెయిటర్‌పై చేయి చేసుకున్న అతిథికి జీవితకాల నిషేధం
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆగ్రా
తాజ్ హోటల్ వేదికగా వెయిటర్‌పై అతిథి చేయి చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంగ్లీష్ రాదనే కారణంతో కమ్యూనికేషన్ లోపం వల్ల ఈ దాడి జరిగినట్లు ఎస్ఎల్ఎంజీ బెవరేజెస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పరితోష్ లఢానీ వెల్లడించారు. ఉద్యోగి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఆ అతిథిని హోటల్ నుంచి జీవితకాలం పాటు బ్లాక్‌లిస్ట్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల రక్షణ ప్రతి యాజమాన్య బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.