గ్రాడ్యుయేట్ ఓటు నమోదు తప్పనిసరి: ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

రిపోర్టర్: BHARADWAJ స్థలం: మునగాల

మునగాల మండలంలో వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఓటర్ నమోదు పత్రాలను ఎమ్మార్వో కార్యాలయంలో ఉపాధ్యాయుడు వక్కంతల భరత్ బాబు సమర్పించారు. గతంలో ఓటు ఉన్నా ప్రతి గ్రాడ్యుయేట్ ఫారం 19 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ నవంబర్ ఆరులోపు దరఖాస్తు చేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఉపాధ్యాయుడు కోరారు.