అనకాపల్లి ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం: యూనిట్లో చెలరేగిన భారీ మంటలు

రిపోర్టర్: సునీల్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లిలోని అరబిందో ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోని యూనిట్ పదిహేను ప్రొడక్షన్ బ్లాక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాణనష్టం జరగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు.