అడవితల్లి రెండు సున్నా ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధి: పవన్ కళ్యాణ్

రిపోర్టర్: నరేష్ స్థలం: Andhra Pradesh

ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అడవితల్లి రెండు సున్నా ద్వారా గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అడుగులు వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గిరిజన గ్రామాలకు చేరవేస్తూ మౌలిక సదుపాయాల కల్పనతో ప్రతి గిరిజన కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందజేస్తున్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేయడం గమనార్హం.