డిక్టేటర్ మీమ్స్‌పై స్పందించిన స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఎంబాప్పే!

రిపోర్టర్: కృష్ణ స్థలం: World

ఫ్రాన్స్, రియల్ మాడ్రిడ్ స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కైలియన్ ఎంబాప్పే సోషల్ మీడియాలో తనపై వస్తున్న డిక్టేటర్ మీమ్స్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చరిత్రలో అపార నష్టానికి కారణమైన నియంతలతో తనను పోల్చడం సరికాదని, ఇది తనకు చాలా బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు దీనిని సరదాగా తీసుకుంటున్నా, మానవ హననానికి పాల్పడిన వారితో పోలిక తగదని స్పష్టం చేశారు.