స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ హైప్లాన్.. మానిటరింగ్ కమిటీ నియామకం

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో పది మందితో రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరా రెడ్డి ఛైర్మన్‌గా, జేడీ శీలం కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా పార్టీ వ్యూహాలు రచిస్తోంది.