మనుబోలులో ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు డ్రైవర్ మృతి, 15 మందికి గాయాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా మనుబోలు పోర్టు అడ్డరోడ్డు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి విజయవాడ వెళ్తున్న వెంకటరమణ ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.