రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రిపోర్టర్: రమేష్
స్థలం: నల్గొండ
న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి నేతల అప్రజాస్వామిక అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి Komatireddy Venkat Reddy వెల్లడించారు. ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ, ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నేతలను అరెస్ట్ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.