జిల్లాల తలసరి ఆదాయం పెంచాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో జిల్లాల వారీగా తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరిగేలా కలెక్టర్లు ప్రత్యేక ప్రణాళికలతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గోవాను మించి సూర్యలంకను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. ఖాయిలా పడిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తిరిగి తెరిపించేందుకు ప్రత్యేకాధికారిని నియమిస్తామని, కొత్త ఆదాయ మార్గాలను సృష్టించాలని అధికారులను ఆదేశించారు.