ఆధార్ కార్డు వినియోగదారులకు కీలక అప్డేట్: పేరు మార్పునకు కొత్త రూల్స్ జారీ చేసిన యూడీఏఐ
రిపోర్టర్: సునీల్
స్థలం: New Delhi
భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ కార్డులో పేరు మార్పులు మరియు సవరణలకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. పాత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను సవరిస్తూ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సరికొత్త నిబంధనల ప్రకారం ఆధార్ పేరు మార్పుల ప్రక్రియను మొత్తం ఐదు కేటగిరీలుగా వర్గీకరించామని, ప్రతి కరెక్షన్కు వేర్వేరు డాక్యుమెంట్లు అవసరమని అధికారులు స్పష్టం చేశారు.