పీఎం జన్మన్ గృహాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా
రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల్లో పీఎం జన్మన్ పథకం కింద 43,592 ఇళ్లు మంజూరవ్వగా, 11,174 పూర్తయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్మాణ వ్యయం అధికంగా ఉండటంతో, అదనంగా రూ.లక్ష సాయం చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించి, నిర్మాణాలను వేగవంతం చేస్తోంది. మిగిలిన ఇళ్ల నిర్మాణాలను ఈ నెలాఖరులోగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.