భీమా కాలువ వద్ద ఉద్రిక్తత: సాగునీటి కోసం రైతుల ఆందోళన
రిపోర్టర్: కిరణ్
స్థలం: వనపర్తి
వనపర్తి జిల్లా పాన్గల్ మండలం చింతకుంట వద్ద భీమా కాలువ నీటి విడుదల వివాదంలో రెండు గ్రామాల రైతుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొందని పోలీసులు తెలిపారు. కాలువ షట్టర్లు మూసివేయడంతో దిగువ ప్రాంతాల పంటలకు నీరు అందక రైతులు ఆందోళనకు దిగారని సీఐ కేఎస్ రత్నం వెల్లడించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి అందరికీ సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారని పేర్కొన్నారు.