టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్‌ను మట్టికరిపించిన పదిహేనేళ్ల కోకో గాఫ్
రిపోర్టర్: గోపి
స్థలం: London
టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్‌ను ఓడించడం తనకు లభించిన గొప్ప గౌరవమని యువ క్రీడాకారిణి కోకో గాఫ్ తెలిపారు. వింబుల్డన్ టోర్నమెంట్ లో పదిహేనేళ్ల వయసులో క్వాలిఫయర్ ద్వారా బరిలోకి దిగిన ఆమె, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వీనస్ పై అద్భుత విజయం సాధించారు. చిన్నతనంలో వీనస్, సెరెనా విలియమ్స్ సోదరీమణుల ఆటను చూసే తాను టెన్నిస్ వైపు అడుగులు వేశానని, వారి స్ఫూర్తితోనే ఈ స్థాయికి చేరుకున్నానని కోకో గాఫ్ ఆనందం వ్యక్తం చేశారు.