లక్షేట్టిపేటలో శనివారం మండల స్థాయి ప్రజా సమస్యల సమీక్ష

రిపోర్టర్: Alfa News Desk స్థలం: లక్సెట్టిపేట

మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఉదయం పదకొండు గంటలకు మండల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మధుసూదన్ తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారంపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా సమీక్షించనున్నారు. వివిధ శాఖల ప్రగతిని పరిశీలించనున్న ఈ కార్యక్రమానికి సర్పంచులు, అధికారులు అందరూ సకాలంలో తప్పకుండా హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.