విజయవాడలో పేదలకు ఇళ్ల పట్టాలపై శాశ్వత హక్కుల ప్రదానం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయవాడ
విజయవాడలో దశాబ్దాల ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ కూటమి ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అధికారులు తెలిపారు. ఈనెల ముప్పైవ తేదీన ఇరవై నాలుగు వేల మందికి పైగా కుటుంబాలకు తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన భూమిపై క్రమబద్ధీకరణ పట్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించనున్నారు. ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన పట్టాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పేదల ఆస్తులకు శాశ్వత భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.