పార్వతీపురంలో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం: గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై సమగ్ర సమీక్ష
రిపోర్టర్: రాజేష్
స్థలం: పార్వతీపురం మన్యం
పార్వతీపురంలో నిర్వహించిన ఐటీడీఏ వది ఐదవ పాలకవర్గ సమావేశంలో అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు సంధ్య రాణి పార్వతీపురం తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయం, ఉద్యానవనం, పశుపోషణ, రహదారులు, విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు మరియు గృహాల నిర్మాణం వంటి కీలక రంగాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు వెల్లడించారు.