నిశ్చితార్థం జరిగిన ఆరు నెలలకే విడిపోయిన క్రికెటర్ పృథ్వీ షా

రిపోర్టర్: కిరణ్ స్థలం: భారతదేశం

భారత క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తన కాబోయే భార్య, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటి ఆకృతి అగర్వాల్‌తో నిశ్చితార్థం జరిగిన కేవలం ఆరు నెలల వ్యవధిలోనే అతడు విడిపోయాడు. భవిష్యత్ లక్ష్యాలు, ప్రస్తుత పరిస్థితులు వేర్వేరుగా ఉండటం వల్ల తాము పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆకృతి గురువారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ధ్రువీకరించింది.