బీఆర్ఎస్ కంచుకోటలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యూహాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను డిఫెన్స్‌లో నెట్టేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. గులాబీ పార్టీ కంచుకోటలైన సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ఈ నెల 30న సిరిసిల్లలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేటీఆర్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గట్టి సవాల్ విసిరారు.