మహిళలపైనే నిబంధనలు ఎందుకు: నటి నమిత సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: గోపి స్థలం: India

పెళ్లి తర్వాత పాటించాల్సిన సంప్రదాయాలు, నిబంధనలు కేవలం మహిళలకే ఎందుకు వర్తించాలని ప్రముఖ నటి నమిత ప్రశ్నించారు. వివాహానికి గుర్తుగా మహిళలు మాత్రమే తాళి ఎందుకు ధరించాలి? పురుషులు కూడా పెళ్లయిందని తెలియజేసే గుర్తును ఎందుకు ధరించకూడదని ఆమె నిలదీశారు. వివాహం ఇద్దరి సమాన భాగస్వామ్యమని, సంప్రదాయాల పేరుతో మహిళలపై ఆంక్షలు రుద్దడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.