భక్తిపారవశ్యంతో పులకించిన వర్ధన్నపేట విఘ్నేశ్వరుని వేదిక
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని మండపం వద్ద మహిళలు భారీ సంఖ్యలో హాజరై కుంకుమ పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గుజ్జ వీరన్న దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు సమర్పించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.