తుఫాను వానతో వణుకుతున్న చింతపల్లి గిరిజనులను తక్షణమే ఆదుకోవాలని వేడుకోలు
రిపోర్టర్: G Satyam🌹
స్థలం: చింతపల్లి
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ పరిధిలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావంతో గిరిజన పల్లెల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే స్పందించి తగిన రక్షణ కల్పించాలని స్థానిక గిరిజనులు ప్రభుత్వ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.