భారీ వర్షాల నేపధ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
తెలంగాణ వ్యాప్తంగా మరియు రాజధాని హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అధికారులతో సమీక్ష జరిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని, జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర కార్పొరేషన్ల కమిషనర్లు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హైడ్రా మరియు పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం స్పష్టం చేశారు.