హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ ఘటనలో హోంగార్డ్ అరెస్ట్

రిపోర్టర్: హరి స్థలం: హఫీజ్‌పేట్, హైదరాబాద్

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై జరిగిన దాడి ఘటనలో నిందితుడైన హోంగార్డ్ ఆనంద్‌ను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి హోంగార్డ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.